పైరవీకారుడికి సీటెలా ఇచ్చారు? | - | Sakshi
Sakshi News home page

పైరవీకారుడికి సీటెలా ఇచ్చారు?

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

పిఠాపురం: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆ పార్టీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి దానం లాజరుబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎనిమిదో వార్డులో ప్రచారానికి వెళ్లిన లాజరుబాబును, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్‌ తలాటం సత్యను జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ వార్డులో ప్రచారం చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. పార్టీలో కష్టపడిన వారికి స్థానం లేదని, పైరవీలు సాగించే నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదో వార్డులో పార్టీ కోసం పని చేసిన వారిని కాదని, పైరవీకారుడికి సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనసేన కోసం కష్టపడిన నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి, అధికారం చేపట్టిన తరువాత పార్టీలో చేరిన పైరవీకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

ఫ మా వార్డులో ప్రచారం చేయొద్దు

ఫ చైర్మన్‌ అభ్యర్థికి

సొంత పార్టీ నుంచే నిరసన సెగ

ఫ పిఠాపురంలో

అడ్డుకున్న జనసేన శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement