గొడవలు సృష్టిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

గొడవలు సృష్టిస్తే చర్యలు

Oct 22 2026 12:39 AM | Updated on Oct 22 2026 12:39 AM

పెద్దాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైన అల్లర్లు, గొడవలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ అన్నారు. పెద్దాపురం రామారావుపేటలోని మున్సిపల్‌ ఎన్నికల స్ట్రాంగ్‌ రూమును, కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ జి.బిందుమాధవ్‌తో కలసి బుధవారం ఆయన పరిశీలించారు. అక్కడ భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యలపై పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల సమయంలో రద్దీని తగ్గించేందుకు అభ్యర్థులు వేర్వేరు సమయాల్లో వచ్చి, పోలీసులకు సహకరించాలని కోరారు. గొడవలకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై బైండోవర్‌, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు అమలు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఏబీజీ తిలక్‌, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సై యు.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement