బీసీలకు చంద్రబాబు నిలువునా మోసం | - | Sakshi
Sakshi News home page

బీసీలకు చంద్రబాబు నిలువునా మోసం

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

కాకినాడ రూరల్‌: బీసీలను చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానడం మరో డ్రామా అని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని సీఎం చంద్రబాబుకు తెలియదా అని గురువారం ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో 34 శాతం రిజర్వేషన్లకు ప్రయత్నిస్తే కోర్టులో చంద్రబాబు అడ్డుకున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని సూచించారు.

కానరాని దిన పంచాంగం!

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో గత కొన్నేళ్లుగా రోజూ పెడుతున్న దిన పంచాంగం, ఆరోజు జరిగే కార్యక్రమాల వివరాలు గత ఐదు రోజులుగా పెట్టకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరగా గత శనివారం ఈ పంచాంగం పెట్టారు. ఆ తరువాత పెట్టలేదు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలూ ఆయా దేవస్థానాల పండితులు గణించిన పంచాంగాన్ని ఆయా దేవస్థానాల వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతున్నారు. అన్నవరం దేవస్థానంలో మాత్రం గుర్తుకు వచ్చినపుడు మాత్రమే పంచాంగం పెడుతున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. ఇది పంచాంగం మాత్రమే కాకుండా దేవస్థానానికి ఒక విధంగా ప్రచారం కూడా. ప్రతిరోజూ పంచాంగం పెట్టేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ప్రైవేట్‌ బస్సులపై కొరడా

అమలాపురం రూరల్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ముమ్మిడివరం పరిధిలోని అన్నంపల్లి టోల్‌ ప్లాజా, రావులపాలెం పరిధిలోని ఈతకోట టోల్‌ ప్లాజా వద్ద గురువారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 33 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 బస్సులపై కేసులు నమోదు చేసి, మొత్తం రూ.18 వేలు అపరాధ రుసుం విధించారు. ఈ మేరకు జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఓలేటి శ్రీనివాస్‌, రవికుమార్‌, రాజేంద్ర ప్రసాద్‌, సురేష్‌ కుమార్‌, షణ్ముఖ్‌ శ్రీనివాస్‌, కౌశిక్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement