సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి గత సెప్టెంబర్‌ మాసానికి గాను హుండీల ద్వారా రూ.1,22,18,492 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో స్వామివారి హుండీలను గురువారం తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. గత 30 రోజులకు గాను రూ.1,15,72,209 నగదు, రూ.6,46,283 చిల్లర నాణేలు హుండీ ఆదాయం రూపంలో వచ్చినట్టు దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ ఎన్‌.సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ నెల రోజుల్లో 15 రోజులు శ్రావణమాసం కాగా, మిగిలిన రోజులు భాద్రపద మాసానికి చెందినవి. భాద్రపదంలో పెద్దగా భక్తులు రాకపోయినా దేవస్థానానికి గణనీయంగా ఆదాయం వచ్చినట్టు వారు వెల్లడించారు. హుండీల ద్వారా బంగారం 29.200 గ్రాములు, వెండి 290 గ్రాములు లభించిందని తెలిపారు. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించిందని, ఖతార్‌ రియల్స్‌ మూడు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీరామ్స్‌ 35, ఒమెన్‌ రియల్స్‌ ఐదు, యూరోలు ఐదు, అమెరికా డాలర్లు 44, సౌదీ సెంట్రల్‌ బ్యాంక్‌ రియల్స్‌ 20, వియత్నాం డాంగ్స్‌ ఐదు లక్షలు లభించాయని చెప్పారు.

గణపతి హుండీ ఆదాయం రూ.17.93 లక్షలు

అయినవిల్లి: అయినవిల్లిలోని ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో చవితి మహోత్సవాల సందర్భంగా 20 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ.17,20,640, ఉత్సవ హుండీ ద్వారా రూ.49,369, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.23,346 కలిపి మొత్తం రూ.17,93,355 నగదు లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 1.9 గ్రాముల బంగారం, 19 గ్రాముల వెండి, రెండు విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్టు ఆయన చెప్పారు. దేవదాయ శాఖ అమలాపురం తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ విళ్ళ సూర్యనారాయణ (సూరయ్య కాపు), ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement