బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 25 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

లో

పెద్దాపురం మండలం సిరివాడ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు పసుపులేటి వెంకట రమణ. కౌలుకు 8 ఎకరాలు తీసుకుని సార్వా వరి సాగు చేశారు. అర్నబ్‌ తుపానుకు పక్వానికి వచ్చిన వరి పంట నేలనంటింది. మిగిలిన పంటను ఏదోలా దక్కించుకునేందుకు యంత్రంతో పంట ఒబ్బిడి చేస్తున్నారు. దిగుబడి దారుణంగా పడిపోయింది. ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (75 కిలోలు) ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా 15 బస్తాలు మాత్రమే వచ్చింది. ఎకరం సాగుకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టారు. దిగుబడి చూస్తే పెట్టుబడి డబ్బులు సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పొలం యజమానికి కౌలు కింద ఎకరాకు 13 బస్తాల ధాన్యం ఇవ్వాలి. మిగిలిన రెండు బస్తాలు ఏం చేసుకోవాలి.. అప్పులు ఎలా తీర్చాలోనని వెంకట రమణ ఆవేదన చెందుతున్నారు.

చిత్రంలోని రైతు పేరు నల్లల గోవిందు. కట్టమూరులో పదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టారు. వరుస తుపాన్లు, అధిక వర్షాల కారణంగా పంట నీట మునిగి, నేలనంటేసింది. గింజలు తాలు రావడంతో పాటు రంగు మారిపోయాయి. నేలనంటిన పొలాన్ని ఒబ్బిడి చేసేందుకు ఎకరానికి సుమారు రూ.15 వేలు అదనంగా ఖర్చవుతోంది. నానా అగచాట్లూ పడి ఒబ్బిడి చేస్తే ఎకరానికి 15 నుంచి 18 బస్తాల దిగుబడి మాత్ర మే వస్తోంది. కనీసం కౌలు ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొందని గోవిందు ఆవేదన చెందుతున్నారు.

8

ధాన్యం దిగుబడి ఎకరాకు 15 బస్తాలే..

కౌలు ఖర్చులు కూడా రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement