● కన్నులపండువగా పున్నమి వేడుక | - | Sakshi
Sakshi News home page

● కన్నులపండువగా పున్నమి వేడుక

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

కార్తిక పౌర్ణమి పర్వదినాన జిల్లా ఆధ్యాత్మిక శోభను అద్దుకుంది. మంగళవారం వేకువనే పుణ్యస్నానాలు ఆచరించి, కార్తిక దామోదరుడిని పూజించిన మహిళలు ఆలయాల పుష్కరిణులు, గోదావరి కాలువల్లో కార్తిక దీపాలు వదిలారు. పగలంతా ఉపవాస దీక్ష ఆచరించారు. సాయం సంధ్య వేళ ఆలయాలకు చేరుకుని, కార్తిక దీపాలు వెలిగించి, పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. నింగి వీధుల నుంచి పిండివెన్నెలలు కురిపిస్తున్న పున్నమి చంద్రుడిని కన్నులారా వీక్షించి, భక్తితో నమస్కరించి, తమను, తమ కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించి, ఉపవాస దీక్షను విరమించారు. రాత్రి పలు ఆలయాల వద్ద జరిగిన జ్వాలాతోరణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– పిఠాపురం/అన్నవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement