చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయండి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయండి

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

● కాకినాడ మేయర్‌ అభ్యర్థిగా కాద సత్యశ్రీని గెలిపించండి

● ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ రూరల్‌: చంద్రబాబు అబద్ధాలకు బుద్ధి చెప్పే విధంగా కాకినాడ కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీని గెలిపించేందుకు నగర ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్‌లో పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థి దంతులూరి వీరభద్రరాజుకు మద్దతుగా కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ప్రచారం నిర్వహించారు. అనంతరం 66, 64, 2వ డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్నారు. రెండో డివిజన్‌లో పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్‌, వంగా గీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేస్తున్న మేయర్‌ అభ్యర్థి కాద సత్యశ్రీ, ఆమె భర్త వెంకట రమణలకు వైద్య రంగంలో మంచి గుర్తింపు ఉందని, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కాకినాడకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కాద సత్యశ్రీని మేయర్‌గా, కార్పొరేటర్లుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement