వలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చి, ఉపాధి కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేశాం. వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇచ్చి, ఈ వ్యవస్ధను కొనసాగిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని విస్మరించింది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు ప్రజాధనాన్ని వృధా చేయడం సరికాదు.
– కె.మనోజ్ కుమార్, మాజీ వలంటీర్,
రాజమహేంద్రవరం
ప్రాణాలకు తెగించి సేవలందించాం
వరదలు, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలందించాం. బాధితులకు అండగా నిలిచాం. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు అందించాం. అటువంటి మమ్మల్ని కాదని ఇప్పుడు వేలకు వేలు చెల్లించి సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లను నియమించాలనే కూటమి ప్రభుత్వ విధానం సరైంది కాదు. దీని ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. సేవా దృక్పథంతో పని చేసిన వలంటీర్లను విస్మరించడం న్యాయం కాదు.
– పెయ్యల శ్రీరామ్, మాజీ వలంటీర్, ముమ్మిడివరం


