కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో గురువారం అమోనియా గ్యాస్ లీకవడంతో స్థానికులు, ప్రజలు హడలెత్తిపోయారు. పిఠాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు గ్యాస్ లీకేజీని అదుపు చేశారు. అమోనియా డ్రెయిన్ అవుట్ లెట్ మూసుకుపోవడంతో లీకేజీ జరిగిందని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అవుట్ లెట్ మూసుకుపోవడాన్ని సిబ్బంది గమనించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
– కొత్తపల్లి


