అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): రోడ్డుప్రమాదాలను నివారించేందుకు, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులపై వెళ్లే ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని, ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్‌ స్పాట్స్‌) గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రియ, డీఆర్వో తిప్పే నాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement