కలెక్టర్‌ను కలసిన జెడ్పీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలసిన జెడ్పీ చైర్మన్‌

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ను కలెక్టరేట్‌లో గురువారం జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. తన పరిపాలనా కాలంలో అందించిన సహకారం మరువలేనిదని చైర్మన్‌ కొనియాడారు. జెడ్పీ ఆత్మీయ సమావేశానికి హాజరైనందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తాండవ నీటిమట్టం

365 అడుగులు

కోటనందూరు: తాండవ నీటిమట్టం స్థిరంగా ఉందని ప్రాజెక్టు డీఈఈ పి.అనురాధ తెలిపారు. డీఈఈ, జేఈఈలు గురువారం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 365 అడుగులకు చేరిందన్నారు. ఇన్‌ఫ్లో అంతంత మాత్రంగానే ఉందని, వర్షాల నేపథ్యంలో కాలువలకు నీటి విడుదలను నిలిపివేశామన్నారు. తుపాను ప్రభావం తాండవ జలాశయంపై పెద్దగా లేదని డీఈఈ వివరించారు.

రాష్ట్ర అధికార ప్రతినిధిగా

లక్ష్మీశివకుమారి

ప్రత్తిపాడు రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కమిటీ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మండల కన్వీనర్‌ రామిశెట్టి బుల్లి రామకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

దిశ, డీఆర్‌సీలో నిర్ణయాలపై

తక్షణం స్పందించాలి : కలెక్టర్‌

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ (దిశ), జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశాలలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల అమలుపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, దిశ, డీఆర్సీ సమావేశాల్లోని నిర్ణయాల అమలుపై జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు.

వాడపల్లి వెంకన్న

ఆదాయం రూ.2.50 కోట్లు

ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి 37 రోజుల హుండీల ఆదాయం రూ.2 కోట్ల 50 లక్షల 11 వేల 671 లభించినట్టు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయ ఆవరణలోని హుండీలను బుధవారం దేవదాయ శాఖ అధికారులు వి.సత్యనారాయణ, ఎస్‌టీపీటీ శ్రీనివాస్‌, దేవాలయాల ఈవోలు ఎస్‌.సత్య మహేంద్ర, వై.సత్యనారాయణ సమక్షంలో లెక్కించారు. ప్రధాన, విశ్వేశ్వర స్వామి హుండీలతో కలిపి రూ.2 కోట్ల 4 లక్షల 24 వేల 921, అన్నప్రసాద వితరణ ద్వారా రూ.45,86,750 లభించాయని చెప్పారు. 84 గ్రాముల బంగారం, 1.617 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన 86 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement