350 విగ్రహాల నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

350 విగ్రహాల నిమజ్జనం

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

కాకినాడ రూరల్‌: గణపతి విగ్రహాల నిమజ్జనం గురువారం ఉత్సాహం జరిగిందని, చిన్న, పెద్ద విగ్రహాలు కలిపి సుమారు 350 నిమజ్జనాలు జరిగాయని నగర గణేశ ఉత్సవ సమితి కాకినాడ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ సాగర తీరాన సూర్యారావుపేట బీచ్‌లో జోరు వానలోనూ భక్తులు ఊరేగింపుగా వచ్చి నిమజ్జనాలు చేశారని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం, పోలీసులతో పాటు నగర గణేశ ఉత్సవ సమితికి చెందిన బొలిశెట్టి రామకృష్ణ, పితాని లీలావతి తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement