ఏలేశ్వరం: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో గురువారం స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు 28,408 క్యూసెక్కుల వరద నీటితో పాటు పురుషోత్తపట్నం నుంచి 1400 క్యూసెక్కుల నీటి నిల్వలు ప్రాజెక్టులోకి వచ్చి చేరాయి. దీంతో ప్రాజెక్టులో 86.56 మీటర్లకు గాను 78.70 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 11.99 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. దీంతో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి సరాఫరా నిలిపివేశారు.


