కాకినాడ రూరల్: వినాయక చవితి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో మండలంలోని సూర్యారావుపేట బీచ్‌లో సాగరుడికి గురువారం సాయంత్రం ఐదు కోట్ల వత్తుల జ్యోతితో కుంభ హారతిని ఘనంగా ఇచ్చారు. తుపాను వేళ ఉగ్రరూపం దాల్చకుండా ప్రశాంతంగా ఉండాలని, కంటికి రెప్పలా కాపాడాలని ఈ సందర్బంగా భక్తులు సాగరుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా భోగి గణపతి పీఠం నిర్వహకుడు దూసర్లపూడి మాట్లాడుతూ రాష్ట్ర జనాభా ఐదు కోట్లు ఉండడంతో సాగరుడికి ఐదు కోట్ల వత్తులతో కుంభ హారతి ఇచ్చినట్టు చెప్పారు. గోదావరి నీరు పారే నదిలో గంగా హారతి ఇస్తామని, 12 నదులు కలిసే సముద్రునికి కుంభ హారతి ఇవ్వడం హిందుత్వ సంప్రదాయమని చెప్పారు.


