వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

ఽభర్తే హత్యచేశాడని బంధువుల ఆరోపణ

ఏలేశ్వరం: మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో శనివారం వివాహిత బేరా అనిత (38) అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం గ్రామానికి చెందిన సాలూరి సత్తిరాజు కుమారై అనితను పెద్దనాపల్లికి చెందిన బేరా సురేష్‌కుమార్‌కు ఇచ్చి 2006లో వివాహం చేశారు. వీరికి ఇంటర్‌ చదువుతున్న రోహిణీ కీర్తి, 8వ తరగతి చదువుతున్న హేమ ఉన్నారు. సురేష్‌కుమార్‌ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు కళాశాలకు, స్కూల్‌కు వెళ్లిపోయారు. అనిత బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చట్టు పక్కల వారు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నట్టు గుర్తించి గ్రామ పెద్దలకు తెలిపారు. వారి సమాచారంతో వచ్చిన ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి మృతితో పిల్లలు అనాథలైపోయారని ఆమె బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

భర్తే నిదింతుడు!

తన చెల్లి అనితను ఆమె భర్తే హత్య చేశాడని అనిత అన్న సాలూరి మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త సురేష్‌కుమార్‌ మద్యం తాగి తన చెల్లిని నిత్యం వేధించేవాడని అతడే ఆమెను ఉరివేసి చంపాడని మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement