సామర్లకోట: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన పార్టీకి చెందిన 10 కుటుంబాలు శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వేట్లపాలెం గ్రామానికి చెందిన నిడదవోలు సురేష్ చౌదరి, రాంబాబు ఆధ్వర్యంలో వారంతా వైఎస్సార్ సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారికి నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్డీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వేట్లపాలెం గ్రామానికి చెందిన వేగుళ్ల వెంకట రమణ, మాకిరెడ్డి రాంబాబు, చిట్టూరి శ్రీను, థామస్ తదితరులను దొరబాబు అభినందించారు.


