బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివిధ ప్రక్రియలను నిర్ణీత గడువులోగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఈఆర్వోలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఓటర్ల జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో మొత్తం 31,695 నోటీసులకు గాను, ప్రస్తుతం కేవలం 1,305 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు సంబంధించి ఫారమ్ 6లో 8,396, ఫారమ్ 8లో 5,386 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నిర్ణీత షెడ్యూల్ లోపే పరిష్కరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ఫ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకర వాతావరణాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ‘నెట్ జీరో హెల్త్ క్యాంపస్’ ప్రాజెక్టును జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టు అమలు తీరు, మొక్కల పెంపకం, సోఫ్ కిట్, పారిశుధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతులు వంటి అంశాలపై సంక్షేమ వసతి గృహాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
కలెక్టర్ హరేంధిర ప్రసాద్


