బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): వారం వారం వస్తున్నాం.. కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం.. అయినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీదారులు నిటూర్పు వదులుతున్నారు. మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనులు కాకపోవడంతో కాకినాడ కలెక్టరేట్‌కు వచ్చి పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌పై వారు పెదవి విరుస్తున్నారు. అర్జీలకు సరైన పరిష్కారం లభించడం లేదని అంటున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 292 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ క్లీనిక్‌కు 32 అర్జీలు సమర్పించారు. వీటిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు స్వీకరించారు. అయితే పరిష్కారం కాని పలు సమస్యలు పరిశీలిస్తే..
పింఛను కోసం అగచాట్లు
గత రెండేళ్లుగా పింఛను ఇవ్వాలని తిరుగుతున్నా, ఎవరూ స్పందించడం లేదు. రోడ్డు ప్రమాదంతో నా కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో బయటకు వెళ్లాలంటే వేరొకరి సహాయం అవసరం. నాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా ఉంది. 70 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా పింఛన్ ఇవ్వడం లేదు.
– జువ్వ సత్యనారాయణ,
శృంగవృక్షం, తొండంగి మండలం
ఫ పీజీఆర్‌ఎస్‌పై అర్జీదారుల పెదవివిరుపు
ఫ సమస్యలు పరిష్కారం
కావడం లేదని ఆవేదన


