అడ్డగోలుగా డీఎస్సీ నియామకాలు చేపట్టి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం ఆగదని కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన గళం వినిపించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సర్పవరం జంక్షన్ వద్ద రెండో దీక్షలో కాకినాడ అర్బన్‌లోని రూరల్ నియోజకవర్గ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


