ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు దాట్ల సత్యనారాయణరాజు అన్నారు. దాగా పడిన యువతకు మద్దతుగా సామర్లకోట స్టేషన్ సెంటర్లో నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, యువతను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదన్నారు. ఈ దీక్ష శిబిరానికి పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు నాయకత్వం వహించగా, రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, జెడ్పీటీసీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


