పంపా రిజర్వాయర్ పూర్తిగా నిండితేనే ఆయకట్టులో ఖరీఫ్ సాగుకు భరోసా ఇవ్వగలం. ఆగస్టు నాటికై నా వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండుతుందని భావించాం. కానీ జూలైలో ఉన్న 90 అడుగుల నీటిమట్టమే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నీటిమట్టంతో నీరు విడుదల చేసినా ఉపయోగం ఉండదు. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల తిరుగు ప్రయాణం (రివర్స్ మాన్‌సూన్)లో వర్షాలు కురిస్తే, అప్పుడు ఆలశ్యంగానైనా ఖరీఫ్‌కు నీరిచ్చే అవకాశం పరిశీలించవచ్చు.
– జి.శేషగిరిరావు, నీటి పారుదల శాఖ ఈఈ


