సాక్షి ప్రతినిధి, కాకినాడ: మెగా కాదు.. దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు దశలవారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగించనుంది. తొలి రోజు శుక్రవారం అన్ని నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ల సారధ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కాకినాడలోని కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. నీట్‌పై యువత పెద్దఎత్తున ఉద్యమిస్తే, కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, ఇక్కడ ఎందుకు చేయడం లేదని అన్నారు. నారా లోకేష్ కేవలం సవాళ్లు, ప్రసంగాలకే పరిమితమా..? అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఉద్యోగాలిచ్చారని, అర్హులైన నిరుద్యోగుల అభ్యంతరాలకు సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికే ఈ అక్రమాలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు. ఉద్యోగానికి రూ.15 లక్షలు బేరమాడిన ఆడియోలు బయటకు వచ్చాయన్నారు. మొదట ఇచ్చిన జీఓ సరైందనుకుంటే.. మళ్లీ ఎందుకు జీఓ ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నడూ క్రీడలు ఆడిన దాఖలాలు లేనివారికి సైతం క్రీడా కోటాలో ఉద్యోగాలు కట్టాబెట్టారన్నారు. దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా, లోకేష్ వెనకడుగు వేస్తున్నారన్నారు. తొలుత కాకినాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాంజీ, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ కాకినాడ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ అబ్జర్వర్లు ఒమ్మి రఘురాం, వాసిరెడ్డి జగన్నాథ్ (జమీల్), మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్ (బన్నీ), జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ తదితరులు ప్రసంగించారు. డీఎస్సీ నియామకాలపై మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్, కలెక్టరేట్ల వద్ద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
ఫ అక్రమాలపై సీబీఐ విచారణకు పట్టు
ఫ దశలవారీ ఉద్యమాలకు
వైఎస్సార్ సీపీ శ్రీకారం
ఫ తొలిరోజు కలెక్టరేట్‌లో
వినతిపత్రం అందజేత
ఫ మంత్రి లోకేష్ రాజీనామా
చేయాలంటూ డిమాండ్


