డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. కష్టపడి చదువుకున్న వారికి అన్యాయం చేశారు. అక్రమాలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో బయట పెట్టారు. వాటికి సమాధానం ఇవ్వకుండా మంత్రి లోకేష్ సవాళ్లు విసురుతున్నారు.
–దాట్ల సూర్యనారాయణరాజు,
కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు
ఉద్యోగాలు అమ్ముకున్నారు
మెగా డీఎస్సీని కాస్త అవినీతిమయం చేశారు. నియామకాల్లో కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో రూ.లక్షలు దండుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారు.
– దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ
పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్
నిరుద్యోగులకు ద్రోహం
ఎన్నో ఆశలతో డీఎస్సీకి సిద్ధమై పరీక్ష రాసిన నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసింది. అర్హులకు అన్యాయం చేసి.. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టింది. జీఓ మార్చి మరీ ఉద్యోగాలు ఇచ్చేసింది. నిరుద్యోగ భృతి కూడా చెల్లించడం లేదు.
– తోట నరసింహం, వైఎస్సార్ సీపీ
జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్
అర్హులకు అన్యాయం
తమకు కావాల్సిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. అది కూడా యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కనపెట్టారు. డీఎస్సీలో అర్హులకు మాత్రం అన్యాయం జరిగింది.
– వంగా గీత, మాజీ ఎంపీ,
పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్
న్యాయం జరిగే వరకు పోరాటం
డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం డీఎస్సీ పేరుతో దగా చేసింది. అర్హులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేస్తాం.
– విప్పర్తి వేణుగోపాలరావు,
జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
అక్రమాలపై మౌనమెందుకో!
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో. సాక్ష్యాలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడింది. డీఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి.
– ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,
కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్


