కాకినాడ జేఎన్‌టీయూకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఇక్కడ వచ్చేవారికి కనీసం సేదతీరే దారిలేకుండా పోయింది. ఇక్కడ బీటెక్ స్పెషల్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. దీర్ఘకాలికంగా ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో గురువారం పరీక్ష రాయడానికి వచ్చింది. ఇలా తన పది నెలల కుమార్తెను కళాశాలకు ఎదురుగా ఉన్న చెట్టుకు ఊయల కట్టి నిద్రపుచ్చింది. మరో కుమారుడు ఆమె పక్కనే ఫోన్‌తో ఆడుకోవడం కనిపించింది. కళాశాలలో విశాలమైన క్యాంటిన్ భవనం ఉన్నా, దానిని విద్యార్థులకు హాస్టల్‌గా కేటాయించారు. దీంతో అభ్యర్థులు ఇలా ఆరుబయటే సేదతీరాల్సిన పరిస్థితి వచ్చింది.
– బాలాజీచెరువు (కాకినాడ సిటీ)


