● 38 రోజులకు రూ.2.11 కోట్ల ఆదాయం
● హుండీలను లెక్కించిన సిబ్బంది
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి జూలైలో హుండీ ఆదాయం దండిగా వచ్చింది. గత 38 రోజులకు రూ.2,10,95,376 సమకూరింది. దేవస్థానంలోని హుండీలను గురువారం తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. వీటిలో నగదు రూ.1,99,36,576, చిల్లర నాణేలు రూ.11,58,800 వచ్చాయని దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. అలాగే 36.300 గ్రాముల బంగారం, 424 గ్రాముల వెండి లభించింది. దీంతో గత 38 రోజులలో సరాసరి హుండీ ఆదాయం రూ.5.55 లక్షలుగా నమోదైంది. అమెరికా డాలర్లు 210, కెనడా డాలర్లు 75, ఖతార్ రియల్స్ మూడు, యూఏఈ ధీరామ్స్ 20, మలేషియా రింగిట్స్ రెండు, యూరోలు 15, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 500, ఆస్ట్రేలియా డాలర్లు పది, శ్రీలంక రూపాయలు 260, భూటాన్ కరెన్సీ ఐదు, నరోడౌ బ్యాంక్ పోలిస్కీ దేశ కరెన్సీ వెయ్యి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమెన్ రియల్స్ రెండు, సెంట్రల్ బ్యాంక్ ఒమెన్ బైసా 300, నేపాల్ రూపాయలు పది, ఉజ్బెకిస్తాన్ కరెన్సీ నాలుగు వేలు లభించాయి. లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సూర్య చక్రధరరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యుడు కామర్స్ చిరంజీవిరావు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.


