చెత్త కుప్పల్లో.. మురికి కాలువల్లో.. | - | Sakshi
Sakshi News home page

చెత్త కుప్పల్లో.. మురికి కాలువల్లో..

Jul 11 2026 12:07 AM | Updated on Jul 11 2026 12:07 AM

‘‘గరికపచ్చ మైదానాల్లోనూ, తామర పూవుల కోనేరులలో, పంటచేలలో, బొమ్మరిళ్లలో, తండ్రి సందిటా, తల్లి కౌగిటా...’’ బాల్యం విహరించాలని మహాకవి శ్రీశ్రీ తన ‘శైశవగీతి కవితలో ఆకాంక్షిస్తాడు. అటువంటి బాల్యం.. నేడు చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో.. మట్టి కొట్టుకుపోయి, ధూళి నిండిన దేహంతో విహరిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. బడికి బయట దీనావస్థలో మగ్గిపోతోంది. బాలల హక్కులు, పరిరక్షణ కోసం చేసిన చట్టాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో.. కల్లాకపటం తెలియని ఆ చిన్ని మోముల్లో చిరునవ్వులు వాడిపోతున్నాయి. వీధి బాలలను, వలస కార్మికుల పిల్లలను అధికారులు గుర్తించి.. వెంటనే వసతి గృహాల్లో చేర్పించాల్సి ఉంది.

– పిఠాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement