తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.68,535, విరాళాలు రూ.40,262, వెరసి మొత్తం రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు.
రత్నగిరికి భక్తుల తాకిడి
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తా రు. రత్నగిరితో పాటు పలు ప్రాంతాలలో శనివా రం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహా లు చేసుకున్న నవ దంపతులు, వారి బందుమిత్రులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల సత్యవ్రతాలు జరిగా యి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాల య దర్శనానికి అరగంట పట్టింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


