కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూ ర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నవరం దేవస్థానం పు రోహితులు, వేద పండితులు కలెక్టర్‌కు వేదాశీర్వచనా లు అందించారు. అనంతరం రాయుడుపా లెం ఉమా మనోవికాస కేంద్రం, సామర్లకోట సిరి మానసిక దివ్యాంగుల పాఠశాల చిన్నారులతో కలసి కలెక్టర్ నూ తన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి, చిన్నారులకు పంచారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కనీస వసతులు కల్పించే ఉద్దేశంతో తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లాలోని దాతలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉద్యోగ సంఘాలు సుమారు రూ.30 లక్షల విరాళాలు అందించారన్నారు. తన సంకల్పానికి సహకరించిన అందరికీ కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు.
రత్నగిరిపై...
అన్నవరం: రత్నగిరిపై నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది అందరికీ శుభం జరగాలని వేద పండితులు ఉదయం స్వామి, అమ్మవార్ల సమక్షంలో వేదాశీస్సులు అందజేశారు. కొండ దిగువన ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించా రు. రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావులకు దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు.
కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు


