
అయినవిల్లి: గణపతి నవరాత్రుల్లో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి శనివారం లక్ష దూర్వార్చన పూజ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపారు. స్వామివారికి పంచ హారతులు ఇచ్చారు. స్వామివారిని మూషిక వాహనంపై ఉంచి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గ్రామోత్సవం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని పర్యవేక్షించారు.