
ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో విజేతలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోటీల్లో స్ట్రాంగ్ మెన్ విన్నర్‌గా కె.దుర్గా శివకుమార్ (కాకినాడ), రన్నర్‌గా కె.మోహన్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమెన్ విన్నర్‌గా డి.అఖిలదేవి (రామచంద్రపురం), రన్నర్‌గా వై.ఇందిర (అమలాపురం), స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్‌గా డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్‌గా బి.అప్పన్న (అమలాపురం) టైటిల్స్‌ను గెలుచుకున్నారు. అలాగే వుమెన్ విభాగంలో 66 కేజీల కేటగిరీలో ఎస్.స్పందన (రాజోలు), 74 కేజీల కేటగిరీలో పి.దీవెన (కాకినాడ), 83 కేజీలో కేటగిరీలో డి.అఖిలదేవి (రామచంద్రపురం), బాలుర సబ్ జూనియర్ విభాగంలో 53 కేజీల కేటగిరీలో పి.వీరేంద్ర (కాకినాడ), 59 కేజీల కేటగిరీలో జె.జితేంద్రదొర (అమలాపురం), 66 కేజీల కేటగిరీలో కె.సాయి మణికంఠ (కాకినాడ), 74 కేజీల కేటగిరీలో ఎంఎస్ విన్ (జగ్గంపేట), మెన్ విభాగంలో 59 కేజీల కేటగిరీలో వై.రాజు (రాజమహేంద్రవరం), 66 కేజీల కేటగిరీలో ఎం.రాహుల్ బాబు (అమలాపురం), 74 కేజీల కేటగిరీలో కె.దుర్గా సాయికుమార్ (కాకినాడ), 83 కేజీల కేటగిరీలో కె.మోహన్ (కాకినాడ), 93 కేజీల కేటగిరీలో కె.సుధీర్ (మలికిపురం), 105 కేజీల కేటగిరీలో బి.అనూష్‌బాబు (మురమళ్ల), మాస్టర్స్ విభాగంలో 83 కేజీల కేటగిరీలో డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), 93 కేజీల కేటగిరీలో బి.అప్పన్న (అమలాపురం) ప్రథమ స్థానాలు సాధించారు. విజేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, నగభేరి కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు దాదాపు 200 మంది పవర్ లిఫ్టర్లు పాల్గొని బరువులెత్తి సత్తా చాటారు.

ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు