
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్చకుడు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి రూ.2,36,023 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3500 మంది భక్తులకు ప్రసాద వితరణ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
విశ్రాంతి షెడ్డుకు 3న
శంకుస్థాపన
అన్నవరం: స్వామివారి దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో విశ్రాంతి షెడ్ నిర్మాణానికి వచ్చేనెల మూడో తేదీ ఉదయం 10.52 గంటలకు ‘లారెస్’ సంస్థ యాజమాన్యం శంకుస్థాపన చేయనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం తెలిపారు. ఆ స్థలాన్ని దేవస్థానం ఈఈ రామకృష్ణ ఆధ్వర్యంలో చదును చేయించి సిద్ధం చేసినట్లు ఈఓ తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇక్కడ వంద అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనుంది. సుమారు రూ.1.5 కోట్లు వ్యయంతో 12,500 చదరపు అడుగుల స్థలంలో టెన్‌సిల్ షెడ్డు ( తెలుపు ప్లాస్టిక్ క్లాత్ తరహా షెడ్డు) నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
గణపతికి 108 వంటకా నివేదన
తాళ్లపూడి: వినాయక చవితి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుదీరిన గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రక్కిలంక గ్రామంలోని కాపుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు.

శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు

శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు