అలంపూర్‌ అభివృద్ధికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

అలంపూర్‌/ అయిజ/ రాజోళి/ ఉండవెల్లి: అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేస్తామని, ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఆమె రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి అలంపూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే చిన్నతాండ్రపాడులో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కలిసి స్వాతంత్య్ర సమరయోధులు కరణం సుబ్బారావు, కరణం సీతారామరావు, పెద్ద సుంకన్నగౌడ్‌ ఫొటోల శిలాఫలకాన్ని, సామాజిక వేత్త ఆనందరావు విగ్రహా న్ని ఆవిష్కరించారు. ఆనందరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన బస్సు షెల్టర్‌ను ప్రారంభించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రాజోళి మండలంలోని పచ్చర్ల నుంచి పెద్దతాండ్రపాడుకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురవడం వల్ల కూలీలకు వీబీజీ రాంజీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చిన్నతాండ్రపాడు గ్రామంలో పలువురు మహనీయులు జన్మిచారని, వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ అభివృద్ధికి నాయకులు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి ఆనందరావు కృషిచేశారని కొనియాడారు.

సురవరం ఆశయాలను కొనసాగించాలి

సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో కంచుపాడు నుంచి జాతీయ రహదారికి రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి, వీబీజీ రాంజీ గ్రాంట్‌లో వివిధ రకాల పనులకు భూమి పూజచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి హాల్‌కు వెళ్లి సురవరం విజయమ్మ అధ్యక్షతన లైబ్రేరియన్‌లో పలు పుస్తకాలను మంత్రి సీతక్కకు అందజేశారు.అలాగే సురవరం విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా కుట్టు మిషన్‌ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామాల్లోని పలు రకాల సమస్యలపై మంత్రులకు వినతిపత్రం అందజేశారు.

రోడ్ల ఏర్పాటుకు

రూ.135 కోట్లు మంజూరు

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క

జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి,

ఎంపీ మల్లురవి తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement