అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు, అసోసియేషన్ ప్రతినిధుల నిరసన
చట్ట ప్రకారమే జరిమానాలు..
కార్యాలయంలో ఏజెంట్ల రగడ..
● నిబంధనల బూచి చూపి నిలువునా దోచుకుంటున్నారని ఆందోళన
● రెండు గంటల పాటు
ఉద్రిక్తత వాతవారణం
● అధికారులకు చురకలు
అంటించిన ఎమ్మెల్యే బండ్ల
● జిల్లాలో హాట్‌టాపిక్‌గా
మారిన సంఘటన
–8లో u
లారీ డ్రైవర్ల ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆర్టీఓ అధికారులకు చురకలంటించారు. ప్రస్తుతం ఏర్పాటైన కార్యాలయం 10 శాతం స్థలం.. మీరు ఎలా నిర్మించారు.. చట్ట ప్రకారం ఎవరూ ఉండకూడదు. చట్ట ప్రకారం వెళ్తే మీరు 5 నిమిషాల్లో ఖాళీ చేయాల్సిన దుస్థితి. చట్టం అందరికీ ఒక్కటే.. డబ్బులు ఇస్తే చట్టం లేదు.. రూ.2 వేలు ఇస్తే జరిమానాలు ఉండవు.. రూ.2 వేలు ఇవ్వకుంటే రూ.20 వేలు ఫైన్ వేస్తారు. ఇద్దేం పద్ధతి.. అంటూ ఆర్టీఓ అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్, లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాం.. వారి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడడం జరిగింది.. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఆయా సమస్యలపై సిబ్బందికి వివరించాం. మానవీయ కోణంలో చూడాలని చెప్పాం. రాష్ట్ర పెద్దలకు సైతం వివరించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెలే లారీ డ్రైవర్లకు భరోసా ఇచ్చారు.
గద్వాల క్రైం: అవీనితి, అక్రమాలకు జిల్లా రవాణా శాఖ కార్యాలయం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆర్థిక ఇబ్బందులతో ట్యాక్స్‌లు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. వాహనం నడపకుండా పార్కింగ్ చేసిన చోటుకు వచ్చి మరీ జరిమానాలు విధిస్తున్నారని లారీ డ్రైవర్లు, అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఉదయం జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్దకు లారీలతో చేరుకుని పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలు రోడ్డుపై తిరగాలంటే ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజుల గడువు ముగిసిపోయిందనే కారణాలు చూపి.. రవాణా శాఖ అధికారులు తనిఖీల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, వినకపోతే వాహనం సీజ్ చేస్తున్నారని వాపోయారు. మరోవైపు పార్కింగ్ చేసిన వాహనాలను సైతం వదలకుండా కేసులు రాస్తున్నారని, పర్మిట్, ట్యాక్సులు చెల్లించేందుకు వచ్చిన లారీలను తనిఖీలు చేసే క్రమంలో వివిధ కారణాలతో యజమానులకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. లారీలకు పసుపు రంగు స్టికర్స్ వేసేందుకు రూ.7 వేలు ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో లారీలకు పసుపు రంగు స్టికర్స్ కోసం రూ.1,500 వసూలు చేస్తుంటే.. గద్వాలలో మాత్రం రూ.5,500 అదనంగా వసూలు చేయడంపై మండిపడ్డారు. మరోవైపు తనిఖీల క్రమంలో పట్టుబడితే అధికారులు వ్యవహరించే తీరుపై ఆవేదన వెలిబుచ్చారు. డ్రైవర్‌తో మాట్లాడుకుంటే ఓ రేటు.. లేకుంటే భారీ మొత్తంలో జరిమానాలు విధించి మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఒకవైపు అద్దెలు రాకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయి.. జీవనోపాధికి దూరంగా ఉన్నామన్నారు. మానవీయ దృక్పథంతో వ్యవహరించాల్సిన అధికారులు నిబంధనల పేరుతో చేస్తున్న దోపిడీపై కలత చెంది నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట లారీలు నిలిపి నిరసన తెలపడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనపై ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు కార్యాలయం వెలుపల చర్చించుకుంటున్న క్రమంలో కొంత మంది ఏజెంట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అధికారులకు సమన్వయంగా వ్యవహరించిన ఏజెంట్ల కారణంగానే ఈ సమస్యలు వచ్చాయని ఆరోపించుకున్నారు. సమన్వయంగా, దళారీగా వ్యవహరించి తాను చెప్పిన వారికే అనుమతులు ఇవ్వల్సిందిగా చెబుతున్నారని మరోవర్గం ఏజెంట్లు దూషించుకున్నారు. ఈ క్రమంలో కొంత రగడ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌కు దారితీసింది.
జిల్లా ఇన్‌చార్జి ఆర్టీఓ అధికారి రాధిక మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్, లారీ డ్రైవర్లు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాము చట్ట ప్రకారమే జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. పసుపు రంగు స్టిక్కర్స్ విషయంలోనూ జీఓ ప్రకారమే అనుమతి ఇచ్చామని, వాటిపై వస్తున్న ఆరోపణాలపై, ఈ రోజు జరిగిన నిరసన ఘటన గురించి ఎమ్మెల్యే కృష్ణమోన్‌రెడ్డికి సైతం వివరించామని చెప్పారు. 10 టైర్ల వాహనంకు రూ.7 వేలు అవుతుందని, అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనడం అవాస్తమన్నారు.


