యువత ఉద్యోగ కల్పకులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఉద్యోగ కల్పకులుగా ఎదగాలి

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

కొత్తకోట రూరల్‌: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని.. స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలపై యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యమని నాబార్డ్‌ గద్వాల, వనపర్తి ఏజీఎం, డీడీఎం మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం మోజర్లలోని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన కళాశాలలో నాబార్డ్‌ ఆధ్వర్యంలో నేషనన్‌వైడ్‌ గ్రామ యువశక్తి క్యాంపెయిన్‌–2026 కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యాన, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, వ్యవస్థాపక అవకాశాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సుస్థిర గ్రామీణ అభివృద్ధిపై వివరించారు. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ వ్యాపారాల ద్వారా యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలను పెంపొందించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నాబార్డ్‌ ఈ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థులు సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement