అలంపూర్: ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ హృదయరాజు అన్నారు. అలంపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. రాబోయే మూడు నెలల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉన్నందున విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, ఇప్పటి నుంచే విద్యార్థులు ఉత్తమ ఫలితాల కోసం ప్రణాళికతో చదవాలన్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి.. విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని, స్టడీ అవర్స్ నిర్వహించాలని, మంచి ఫలితాలు సాధించడానికి తమవంతుగా కృషి చేయాలని సూచించారు. కళాశాలలో చేపడుతున్న విద్యా ప్రణాళికలు, అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. స్థానికులు రిటైర్డు ప్రొఫెసర్ ఉచిత ఇంగ్లిష్ బోధన అందించడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ దేవేందర్‌రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


