పంట పండినట్లే.. | - | Sakshi
Sakshi News home page

పంట పండినట్లే..

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

పంట పండినట్లే.. సాగు ఆలస్యం.. ఇదే చివరితడి..

అమరచింత ఎత్తిపోతల నీటితో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. జూరాల ఎడమ కాల్వకు నీరు ఆలస్యంగా వదలడం, ఎత్తిపోత ల ద్వారా పంట కాల్వలకు చేరడంలో జాప్యం కారణంగా పంటసాగు ఆలస్యమైంది. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. చివరితడి అందితే పంట చేతికొస్తుంది. శుక్రవా రం ఎడమ కాల్వకు సాగునీరు వదలడంతో ఇక పంట పండినట్లేనన్న ధైర్యం వచ్చింది.

– శ్రీనివాసులు, రైతు, సింగంపేట

అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఈసారి వరి నాట్లు ఆలస్యమయ్యాయి. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో సాగుచేసిన వరి పంటలు కోతలకు వచ్చినా.. అమరచింత ఎత్తిపోతల కింది వరి పంటలు అక్కడక్కడ పొట్టదశలో ఉన్నాయి. చివరితడి వదిలితే పంటలన్నీ చేతికందుతాయని ఎస్‌ఈకి విన్నవించాం. రైతుల కోరిన మేరకు సాగునీటిని వదలడం సంతోషంగా ఉంది.

– ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి,

అమరచింత ఎత్తిపోతల పథకం

జూరాల ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ వరి పంటలు పొట్టదశలో ఉన్నాయని రైతులు విన్నవించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను గుర్తించిన ప్రభుత్వం చివరితడిగా సాగునీటిని వదలాలని ఆదేశించింది. ఇదే చివరితడి అనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి.

– చంద్రశేఖర్‌,

ఎస్‌ఈ, ప్రియదర్శిని జూరాల జలాశయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement