మరమ్మతు ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు ఎప్పుడో?

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

టెండర్‌ ప్రక్రియ పూర్తి..

చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరించేందుకు మంత్రి చొరవతో నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. పనులను దక్కించుకున్న గుత్తేదారుతో అగ్రిమెంట్‌ మాత్రం పూర్తి కాలేదు. త్వరలోనే అగ్రిమెంట్‌ పూర్తిచేసి మరమ్మతు పను లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

– సమీ ఉల్లా, డీఈ, ఇరిగేషన్‌శాఖ

అమరచింత: మక్తల్‌ నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రూపుదిద్దుకున్న చంద్రగఢ్‌ లిఫ్ట్‌ మరుగునపడుతోంది. కొన్నేళ్లుగా మరమ్మతు కు నోచుకోక ఆయకట్టు రైతులకు అక్కరకు రాకుండాపోతోంది. ఎత్తిపోతల పథకం మరమ్మతు కోసం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఏడాదిన్నర క్రితం రూ. 6.50కోట్లు మంజూరు కావడంతో అధికారులు టెండర్లను ఆహ్వానించారు. గతేడాది టెండరు ప్రక్రియ పూర్తయింది. అయితే సదరు గుత్తేదారు నేటికీ అగ్రిమెంట్‌ చేసుకోకపోవడంతో మరమ్మతు పనులు మరుగునపడ్డాయి.

2,800 ఎకరాలకే సాగునీరు..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిల్వ నీటి ఆధారంగా చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాలను 2005లో రూ. 50కోట్లతో నిర్మించారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5వేల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఆయా పథకాల నిర్వహణ బాధ్యతలను ఆయక ట్టు రైతులకు అప్పగించారు. అయితే గుత్తేదారు నాణ్యత లేని పైపులు వేయడంతో ఎక్కడికక్కడ ధ్వంసమై వాటి నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. ఏటా పైపులు పగిలి పంటలు నష్టపోయిన సందర్భాలున్నాయి. పైప్‌లైన్లు మార్చాలని గత ప్రభు త్వ హయాంలో అనేక పర్యాయాలు ప్రతిపాదన లు పంపినా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. దీంతో చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పరిధిలో 2,800 ఎకరాలు మాత్రమే సాగులోకి వస్తుంది.

ఇదీ పరిస్థితి..

చంద్రగఢ్‌, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఫ్యానల్‌ బోర్డులు కాలిపోయాయి. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన పైప్‌లైన్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతు పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాల్సి ఉంది. వీటితో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ల ను కొత్తగా బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయించారు.

● నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి గ్రావిటీ కెనా ల్‌, పైప్‌లైన్‌ మార్చాల్సి ఉంది. చిన్న సంపుహౌజ్‌ల ను నిర్మించాల్సి ఉంది. వాటితోపాటు ఫ్యానల్‌ బో ర్డు మార్చేందుకు రూ.2.85 కోట్లతో ప్రతిపాదించా రు. చంద్రగఢ్‌ ఎత్తిపోథలలో ఫ్యానల్‌ బోర్డుతో పైపులైన్‌ మార్చేందుకు రూ. 1.93కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. బెక్కర్‌పల్లి ఎత్తిపోథల పథకానికి సంబంధించి రూ.2.13 కోట్లు అవసరమని ఇరిగేషన్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో నిధులు మంజూరయ్యాయి.

మరుగున పడుతున్న చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకం

ఏడాదిన్నర క్రితం

రూ.6.50కోట్లు మంజూరు

టెండరు ప్రక్రియ పూర్తి..

అగ్రిమెంట్‌లో సాగదీత

పైప్‌లైన్ల మరమ్మతు,

ఫ్యానల్‌ బోర్డులే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement