గద్వాల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి అక్షరాస్యత సంఖ్య జ్ఞానాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కాంపింటేంట్ పాఠశాలల విద్యార్థుల ప్రగతిని నమోదు చేసేందుకు రూ పొందించిన ప్రత్యేక బుక్‌లెట్లను విద్యాశాఖ అ ధికారులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు జిల్లాలోని 87 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రత్యే క విద్యా బోధకులను నియమించినట్లు తెలిపా రు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులలో వి ద్యార్థులు ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి వారికి తగిన రెమెడియల్ బోధన అందించాలని, గణిత బోధనలో వస్తువులు, చిత్రా ల సహాయంతో భావనలు సులభంగా అర్థమయ్యేలా పఠన సామర్థ్యాల కోసం ప్రతిరోజూ చదివే అలవాటు ప్రోత్సహించాలని చెప్పారు.
‘బాలల ప్రజావాణి’..
బాలల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక పిల్లల ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 40 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పెండింగ్‌లో దరఖాస్తులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం, మహిళలకు చీరల పంపిణీ, కొత్త చేయూత పెన్షన్ పత్రాల అందజేతకు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 11..
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు పలు సమస్యలపై ఏఎస్పీ శంకర్ దృష్టికి తీసుకుచ్చారు. ఇందులో ఆస్తి వివాదం, భూ సంబంధ, మోసాలు తదితర అంశాలపై 11 ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ అన్ని ఫిర్యాదులను ఆయా స్టేషన్ అధికారులకు సిఫార్సు చేసి.. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
టెంకాయల వేలం ఖరారు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం చైర్మ న్ ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో వేలం పాటలు ని ర్వహించారు. ఈ సందర్భంగా టెంకాయల వే లం రూ.25,05,999లను మల్దకల్ గ్రామానికి చెందిన పూజారి మల్దకల్ దక్కించుకోగా.. తలనీలాల వేలంను నాగర్‌కర్నూల్‌కు చెందిన రామకృష్ణ రూ.3,27,777కు దక్కించుకున్నట్లు ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. వేలం పాటల ద్వారా గతేడాది కంటే ఈసారి అధిక ఆదాయం సమకూరిందని చైర్మన్ తెలిపారు.
విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలి
గద్వాల: జిల్లాను నాణ్యమైన విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని నాబార్డు ఏజీఎం మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలంలోని తిమ్మాపుర్‌లో నాబార్డు ప్రాజెక్ట్ కింద వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రాబోయే రబీ సీజన్‌లో రైతులు మినుము వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు.


