కోట్లు
రూ.7,325
గద్వాల న్యూటౌన్: ప్రతి ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో అవసరమైన లబ్ధిదారులకు రుణాలు అందించి.. వారికి ఆర్థికంగా చేయూతనందించడంతోపాటు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి.. ఆర్థిక స్వావలంబన సాధనలో భాగంగా ప్రతి జిల్లాలో లీడ్ బ్యాంక్ అధికారులు వార్షిక రుణ ప్రణాళిక రూపొందిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ రంగాలు, వాటి విభాగాలకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో అందించాల్సిన వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఇందులో విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహ నిర్మాణాలు, వివిధ వ్యాపారాలు, సంస్థల నిర్వహణకు గాను లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆయా రంగాల్లోని విభాగాల్లో 1,74,410 మంది లబ్ధిదారులకు రూ.7,325 కోట్లు అందించేలా ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించగా.. ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన జరిగిన డీసీసీ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసి.. ఆమోదించారు. కాగా.. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాల్లో 2,01,300 మంది లబ్ధి దారులకు రూ.6,472 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా...1,83,3003 మందికి రూ.5,622.72 కోట్లు మాత్రమే అందించారు.
రుణాలతోనే ప్రగతి..
నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ మొత్తం 1,82,860 మంది రైతులు ఉండగా ఇందులో 90 శాతం సన్న, చిన్నకారు రైతులే. రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పెట్టుబడి సాయం పథకాలు ఉన్నప్పటికీ అన్ని అవసరాలు తీరవు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. అయితే రైతులకు సకాలంలో పంట రుణాలు అందిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. గోదాంలు, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు కూడా జిల్లాలో అవసరం ఉంది. వీటి నిర్మాణాల కోసం అవసరమైన రుణాలు అందించి.. ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది. ఇక నడిగడ్డ రెండు జీవనదుల మధ్య ఉండగా.. ఏళ్ల తరబడి పాడి రైతులు అదే రంగంపై జీవిస్తున్నారు. పాడి రైతులకు విరివిగా రుణాలు అందిస్తేనే జిల్లాలో పాలు, పాల పదార్థాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఇక పౌల్ట్రీ రంగంపై కూడా చాలామంది ఔత్సాహికులకు ఇష్టం ఉన్నా.. తగినంత పెట్టుబడి లేక ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి వారికి రుణాలు అందించి, పౌల్ట్రీ రంగాన్ని జిల్లాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
ఉన్నత చదువులకు..
జిల్లాలో చాలామంది విద్యార్థులు, యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులు, యువతకు బ్యాంకర్లు రుణాలు అందిస్తేనే వారు ఉన్నత చదువులు చదుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుతారు. అలాగే చాలామందికి సొంతిల్లు అనే కల ఉంటుంది. ఇందులో మధ్య తరగతి వారి సంఖ్య ఎక్కువ కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో గృహ నిర్మాణానికి కావాల్సిన వస్తువుల ధరలు బాగా పెరిగాయి. గృహ నిర్మాణానికి చేతినిండా డబ్బు ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది, గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల స్థాపనను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలామంది నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పునరుత్పాదక రంగానికి రుణాలు అందించి చేయూత ఇవ్వాలి. ప్రధానంగా ఈ రంగంలో రుణాలు అందించి సౌర విద్యుత్, గోబర్ గ్యాస్ లాంటి ఉత్పాదనలు ప్రోత్సహించాలి.
● కాగా.. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రంగాల్లో 2,01,300 మంది లబ్ధిదారులకు రూ.6,472 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా...1,83,3003 మంది అబ్దిదారులకు రూ. 5622.72కోట్లు అందించారు.
వార్షిక ప్రణాళిక ఖరారు చేసిన లీడ్ బ్యాంక్ అధికారులు
విద్య, వ్యవసాయం, వ్యాపారాలు,గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం
1,74,410 మంది లబ్ధిదారులకు అందించేలా కసరత్తు
విరివిగా అందిస్తేనే
ఆర్థిక సాధికారతకు అవకాశం
గతేడాది నెరవేరని లక్ష్యం
మేర రుణ పంపిణీ


