● రాష్ట్రస్థాయి టోర్నీలకు
ఐదు జిల్లాలకు కేటాయింపులు
● అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు
● సెలక్షన్స్ అనంతరం టోర్నీల నిర్వహణ
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడా సందడి మొదలుకానుంది. ఇప్పటికే మండలస్థాయి పోటీలు ముగింపు దశకు చేరుకోగా.. త్వరలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ టోర్నీలు కేటాయించారు. గత నెలలో జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మంగళవారం టోర్నీలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ అనంతరం ఆయా పోటీలు నిర్వహించనున్నారు.
● మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్–19 బాల, బా లికల వాలీబాల్, అండర్–17 బాల, బాలికల హ్యా ండ్‌బాల్, అండర్–19 బాలుర క్రికెట్, అండర్–19 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి.
● వనపర్తి జిల్లాలో అండర్–19 బాలికల హాకీ, అండర్–19 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలు కేటాయించారు.
● నారాయణపేటలో అండర్–14 బాల, బా లికల రెజ్లింగ్ (ఫ్రీస్టైల్), అండర్–14, 17 బాల, బాలికల బీచ్‌వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో అండర్–17 బాల, బాలికల చెస్, అండర్–17 బాల, బాలికల కబడ్డీతో పాటు అండర్–14, 17, 19 బాల, బాలికల మల్కంబ్ పోటీలు జరగనున్నాయి.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో అండర్–14 బాల, బాలికల చెస్, అండర్–17 బాలుర క్రికెట్, అండర్–17 బాల, బాలికల సెపక్‌తక్రా, అండర్–17 బాలుర హాకీ, అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలు కేటాయించారు.


