చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

గద్వాల: జిల్లాలో చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు వంటి జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి విస్తీర్ణం హద్దులను సంబంధిత వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో 101 చిత్తడి నేలలను గుర్తించామని వాటి సరిహద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా కొలిచి రికార్డులలో నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో రీసర్వే జరుగుతున్నందున వీటి పరిధిలో చిత్తడి నేలలు ఉంటే సర్వే కొంత సులభతరం అవుతుందన్నారు. చిత్తడి నేలల ఆవాసాల పరిధిలోని ప్రజలతో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకెళ్లాలన్నారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియ గడువులోగా పూర్తిచేసి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ కేశవరావు, సర్వే ఏడీ నూకరాజు, డీపీఓ శ్రీకాంత్‌, మత్య్సశాఖ అధికారి షకీలాభాను, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పర్వీజ్‌అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సదరం పత్రాలు

జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు అందజేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక మెగా సదరం శిబిరాన్ని కలెక్టర్‌ సందర్శించి.. సూచనలు చేశారు. ప్రతి కేసును సంబంధిత వైద్యులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరణ పత్రం జారీ చేయాలన్నారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు టోకెన్‌ నంబర్లు కేటాయించి సీరియల్‌ నంబర్‌ ప్రకారం లోపలికి పంపించి వైద్య పరీక్షలు చేయాలన్నారు. బుధవారం సైతం శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ ముసాయిదాబేగం, డీపీఎం అరుణ, ఏపీఎం భీమన్న, వైద్యులు హేమలత, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement