రైతుల శ్రేయస్సు కోసమే వరుణయాగ పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

రైతుల శ్రేయస్సు కోసమే వరుణయాగ పాదయాత్ర

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

రాజోళి: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలు పండాలని కాంక్షిస్తూ బుధవారం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ వరుణయాగ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి నీటిని తీసుకొచ్చి.. శాంతినగర్‌లోని ఈశ్వరమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి డప్పుల మోతల మధ్య కాడెద్దులతో పాదయాత్రను ప్రారంభించారు. జూలకల్‌ వద్దనున్న శివాలయానికి చేరుకొని పరమశివుడిని నదీ జలాలతో అభిషేకించారు. అనంతరం రైతులతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని అలంపూర్‌ నియోజకవర్గ రైతులతో కలిసి వరుణయాగ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement