తల్లిదండ్రులు గమనించాలి.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు గమనించాలి..

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.

– అనిల్‌ రాజ్‌, మానసిక వైద్యుడు, జనరల్‌ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌

కఠిన చర్యలు..

గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి.. గంజాయిని పట్టుకున్నాం. అదేవిధంగా గంజాయి విక్రేతలను అరెస్టు చేశాం. యువత గంజాయికి బానిసలుగా మారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.

– టి.శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement