రాజోళి: ఆర్డీఎస్ రైతులకు న్యాయం జరిగి, సాగునీరు అందేవరకు వారికి తోడుగా పోరాటాలు సైతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మండల అధ్యక్షుడు నాగరాజు, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం సాగునీటి సమస్యలపై బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయకట్టు రైతులు ప్రతి ఏడాది మోసపోతున్నారని, మాయమాటలు చెప్పి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు మోసం చేస్తునే ఉన్నారన్నారు. విద్యుత్ సమస్యలు ఇళ్లలోను, రైతులకు ఇబ్బందిగా మారాయని వాటిపై అధికారుల అలసత్వం వీడేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అశోక్, రాఘవేంద్ర, శివ, రాజశేఖర్, మోహన్, వెంకటేష్, పరుశరామ్ పాల్గొన్నారు.
టూడేలీగ్‌లో
విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్‌సీఏ టూడేలీగ్‌లో పాల్గొనే ఉమ్మ డి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. జట్టులో ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్‌నగర్), సంజయ్ (నాగర్‌కర్నూల్), అభిలాష్‌గౌడ్ (నారాయణపేట), వర్షిత్‌రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), జి.జశ్వంత్ (నాగర్‌కర్నూల్), ముఖిత్ (మహబూబ్‌నగర్), గగన్ (నాగర్‌కర్నూల్), వెంకట్‌సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్‌నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్‌కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్‌నగర్ జట్టు తన తొలి మ్యాచ్‌లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్/అచ్చంపేట రూరల్: ఆర్టీసీ ఉద్యోగుల సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఆర్టీసీ డిపోల వద్ద ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విలీనం కంటే ముందున్న సమస్యలను ఎలా పరిష్కరించబడాలనే విషయంలో విలీన కమిటీ అధ్యయనం చేయాలన్నారు. కార్మికుల సమష్టి పోరాటం మూలంగా 11శాతం వేతన సవరణ జరిగిందన్నారు. కార్మిక వర్గానికి లాభం జరగాలంటే సంపూర్ణ ఉద్యోగ భద్రత, పని భారం, వేధింపులు లేని ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలన్నారు. సమావేశాల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజనల్ కార్యదర్శి వెంకటయ్య, నంది వెంకటేశ్ ఉన్నారు.
విద్యార్థుల నిరసన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ సెమినార్‌ను యూనివర్సిటీలోనే నిర్వహించాలని డి మాండ్ చేస్తూ ఆదివారం పీయూ విద్యార్థులు ని రసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పీ యూ ఫార్మసీ కళాశాల హాస్టల్ వద్ద మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీకే తలమానికంగా నిలిచే నేషనల్ సెమినార్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం స రైన పద్ధతి కాదన్నారు. అధికారులు మొండిపట్టు వీడి యూనివర్సిటీలోనే కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం ఉషా ద్వారా రూ.100 కోట్లు విడుదలైతే వాటికి సంబంధించి న నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే అధికారులు కార్యక్రమా న్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని ఆ రోపించారు. అధికారులు నిర్ణయం మార్చుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.


