వీబీ–జీ రామ్ జీ ద్వారా చేపట్టే ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్, బోర్‌వెల్స్, ఓపెన్ వెల్స్ రీచార్జి పనులను ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లాస్థాయి అధికారులు మండల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి.. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో అక్కడక్కడ ఇంకుడు గుంతల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఐదెకరాలలోపు భూమి కలిగి.. జాబ్‌కార్డు ఉన్న రైతుల పొలాల్లో ఫారం పాండ్స్, బోర్‌వెల్, ఓపెన్‌వెల్ రీచార్జి నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు రూపొందిస్తున్నారు.


