నోటమాట రావట్లే..! | - | Sakshi
Sakshi News home page

నోటమాట రావట్లే..!

Mar 6 2026 8:25 AM | Updated on Mar 6 2026 8:25 AM

ధరలు లేక రైతన్నల ఆవేదన

కొన్నిరోజులుగా కిలో రూ.5 మించని రేటు

అదనపు భారంగా మారిన కూలీలు, మార్కెట్‌కు తరలింపు వ్యవహారం

ఆరుగాలం శ్రమించి

జీవాలకు వదిలేస్తున్న వైనం

జిల్లాలో చాలా వరకు తోటల తొలగింపు

సాగు పెరగడం వల్లే..

యాసంగి సీజన్‌లో టమాట బాగా పండింది. స్థానికంగా సాగైన టమాటతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ప్రధానంగా మదనపల్లి నుంచి ఇక్కడి మార్కెట్‌కు బాగా వస్తోంది. పంట సాగు విస్తీర్ణం బాగా ఎక్కువ అయ్యింది. దీని వల్లే ధరలు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.

– ఎంఏ అక్బర్‌, జిల్లా ఉద్యానశాఖాధికారి

పంట తీసివేశా..

అర ఎకరాలో టమాట వేశాను. జనవరి మూడో వారంలో పంట చేతికి వచ్చింది. ఆ నెలలో కొంత రేట్లు వచ్చాయి. ఫిబ్రవరిలో తగ్గాయి. గత కొద్ది రోజుల నుంచి కనీసం కూలీల, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు కూడా రాలేదు. చేసేది లేక పంట తీసివేశా.

– సుదర్శన్‌రెడ్డి, రైతు, గద్వాల

టమాట రైతులు విలవిలలాడుతున్నారు. ధరలు రాక అల్లాడుతున్నారు. కనీసం టమాట తెంపిన కూలీలు, మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా చార్జీలు కూడా రాక.. తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొంతమంది రైతులు జీవాలకు వదిలేస్తే.. మరికొంత

మంది తమ చేతులతోనే తొలగిస్తున్నారు. గడిచిన ఏడాది కూడా ఈ సమయంలో ఇలానే ధరలు పడిపోయి ఆర్థికంగా నష్టపోగా.. అవే పరిస్థితులు ఈసారి కూడా దాపురించాయని ఆవేదనకు లోనవుతున్నారు. మార్కెట్‌లో లభిస్తున్న ధరలు చూసి తమకు నోటమాట రావడం లేదని వాపోతున్నారు. – గద్వాల వ్యవసాయం

డిగడ్డలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లో బోర్లు, బావుల కింద టమాట పండిస్తున్నారు. ధరూరు, మల్దకల్‌, గద్వాల, ఇటిక్యాల, అయిజ, వడ్డేపల్లి, మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. టమాట విత్తిన నాటి నుంచి 55– 60 రోజులకు పంట చేతికి వస్తుంది. ఎకరాకు కనీసం రూ.15–18 వేల వరకు ఖర్చు అవుతోంది. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత టమాట తెంపడానికి ఒక కూలీకి రోజుకు రూ.400, మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఒక బాక్స్‌కు దూరాన్ని బట్టి రూ.20–40 వరకు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 372 ఎకరాల్లో ఇక్కడి రైతులు టమాట సాగు చేశారు. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో 20 కిలోల టమాటల బాక్సుకు రూ.50–120 ధర చెల్లిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

నెల ధర (రూ.లలో..)

డిసెంబర్‌ 600– 700

జనవరి 400– 500

ఫిబ్రవరి 150– 200

మార్చి 50– 120

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement