చేతికి వచ్చిన పంటను డిసెంబర్ నుంచి విక్రయించడానికి మార్కెట్‌కు టమాటను తీసుకెళ్లారు. ఇదే సమయంలో కర్నూలులోని పత్తికొండ, దేవనకొండ, ఆలూరు, ఆస్పరి, ప్యాపిలి, చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి ఇక్కడి హోల్‌సేల్ మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. అక్కడి టమాటకు తోడు ఇక్కడి రైతులు పండించిన టమాట కూడా మార్కెట్‌కు వస్తోంది. అయితే డిసెంబర్‌లో ఓ మాదిరి ధరలు వచ్చాయి. జనవరిలో కొంత తగ్గగా.. ఫిబ్రవరిలో మరికొంత.. ప్రస్తుత మార్చి నెలలో పూర్తిగా పడిపోయాయి. కొంతమంది టమాట తెంపిన ఖర్చులు కూడా రాావని చేలల్లోనే పారబోశారు. ఇంకా కొంతమంది టమాట చేనును జీవాలకు వదిలేశారు. ధరలు రాక టమాట ఆర్థికంగా నష్టపోతున్నామని, తమకు తెంపిన కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. గడిచిన ఏడాది కూడా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇదే పరిస్థితి ఎదురై ఆర్థికంగా నష్టపోయామని.. ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


