జిల్లాలో రేషన్ బియ్యం దందాపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యూహాత్మకమైన చర్యలతో వ్యాపారులు, డీలర్లు ఎవరనే అంశాలపై నివేదిక ద్వారా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. సిబ్బంది నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. గతంలో నమోదైన కేసులు, వ్యాపారులు, సహకరించిన వ్యక్తులెవరు అనే కోణంలో నిఘా ఉంచాం. బియ్యం కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల
●


