సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డ | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో మెరిసిన పాలమూరు బిడ్డ

Mar 7 2026 7:32 AM | Updated on Mar 7 2026 7:32 AM

పట్టుదలతో చదివి ర్యాంకులు..

నిజాలాపూర్‌ గ్రామానికి చెందిన మునుగల్‌ఛేడ్‌ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడైన ఎం.వెంకటేష్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌లోని పటాన్‌చెరువు శ్రీసాయి పబ్లిక్‌ స్కూల్‌లో 1, 2వ తరగతులు, 3వ తరగతి కొత్తకోటలోని జీటీ నారాయణ, 4 నుంచి 10వ తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని చైతన్య సెంట్రల్‌ స్కూల్‌లో చదివారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్‌(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్‌), పీజీ పూర్తి చేశారు. వెంకటేష్‌ ప్రసాద్‌ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ట్రాన్స్‌కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి యశోద గృహిణి. వీరు మహబూబ్‌నగర్‌లోని శేషాద్రినగర్‌లో నివాసముంటున్నారు. గతేడాది సివిల్స్‌లో 700వ ర్యాంకు సాధించిన వెంకటేష్‌.. ఈసారి సత్తా చాటి 358వ ర్యాంక్‌ పొందాడు. 2025లో విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాదించాడు. గతేడాది సెప్టెంబర్‌ 27న డిప్యూటీ కలెక్టర్‌గా ఉత్తర్వు అందుకున్న ఆయన అదేనెల 29న నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్రూప్‌–1 అధికారుల శిక్షణలో ఉన్నాడు. ‘ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యం. మరోసారి ప్రయత్నించి.. ఐఏఎస్‌ సాధిస్తా.’ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకటేష్‌ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement