10 అంశాలు.. 99 రోజులు | - | Sakshi
Sakshi News home page

10 అంశాలు.. 99 రోజులు

Mar 6 2026 8:25 AM | Updated on Mar 6 2026 8:25 AM

‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు సిద్ధం

చర్చకు వచ్చే అంశాలు..

గ్రామ సభల్లో రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, సోలార్‌ పంప్‌లు, మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌పీవీ వేక్సినేషన్‌, రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, సన్న ధాన్యానికి బోనస్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మహాలక్ష్మి, ఆదర్శ పాఠశాలలు, నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వంటి తదితర పథకాల అమలు, లోపాలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో రెండేళ్ల ప్రగతి నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రభుత్వ శాఖల వారీగా సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. తాజా సభల్లో వచ్చిన వాటిని సైతం పొందుపరిచి.. రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేసే కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యాచరణను పకడ్బందీగా నిర్వహించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల వారీగా అధికారులతో పలు పర్యాయాలు సమీక్షించారు. గురువారం సైతం కలెక్టర్‌ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించి లోటుపాట్లు లేకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జాగ్రత్తలను వివరించారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: హామీల అమలు, ‘అధికార’ యంత్రాంగం పనితీరును మెరుగు పర్చడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిని ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పది అంశాల (థీమ్‌)ను ప్రాధాన్యతగా తీసుకుని 99 రోజుల ప్రణాళికతో సర్కారు సూచించిన కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిరోజు శుక్రవారం తొలుత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సమీకృత కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉదయం సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి పాలమూరులోని ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఐదు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తదితర అధికారులు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశం అనంతరం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పురపాలికలు, పంచాయతీల పరిధిలో పరిసరాల పరిశుభ్రత.. పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నోడల్‌ అధికారులుగా అదనపు కలెక్టర్లు..

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో ఎంచుకున్న పది ప్రధాన అంశాల్లో షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల కు సంబంధించి ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ప్రభుత్వం నోడల్‌ అధికారులుగా నియమించింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), మండల స్థాయిలో ఎంపీడీఓలను నోడల్‌ అధికారులుగా నియమించారు

5 దశల్లో సభలు..

99 రోజుల పాటు ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ఐదు దశల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యమయ్యేలా సభలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ రెండో తేదీన గ్రామస్థాయిలో, 16న మండలస్థాయిలో, మే రెండో తేదీన నియోజకవర్గ, 22న జిల్లా, జూన్‌ 2న రాష్ట్రస్థాయిలో సభల నిర్వహించేలా అధికారులు ముందుకుసాగుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో జరిగే సభల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉన్నవాటిపై తగిన చర్యలకు ఉపక్రమించనున్నారు. కొత్త రేషన కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి ఆయా పథకాలకు కొత్త లబ్ధిదారుల వివరాల నమోదుతోపాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. కాగా, ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు/చైర్‌పర్సన్లకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక ఉద్దేశం, ప్రాధాన్యంపై అవగాహన కల్పించేలా ఈ నెల 12న ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.

వేరుశనగ క్వింటాల్‌ రూ.9,289

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మా ర్కెట్‌ యార్డుకు గురువారం 756 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,289, కనిష్టంగా రూ.3,149, సరాసరిగా రూ. 8,072 పలికాయి. అలాగే 7 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,129, కనిష్టంగా రూ.5,829 వచ్చాయి.

కా,/ము: కార్పొరేషన్‌ /మున్సిపాలిటీ

మార్చి 6 నుంచి 15

పరిసరాల పరిశుభ్రత..

పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌

ఏప్రిల్‌ 13 నుంచి 18 రోడ్డు భద్రత

మే 11 నుంచి 16 వరకు విద్య, అభివృద్ధి

ఏప్రిల్‌ 27 నుంచి మే 2 వరకు

పిల్లల భద్రత.. డ్రగ్స్‌ నియంత్రణ

మే 25 నుంచి 30 వరకు మహిళల సాధికారత

ఏప్రిల్‌ 20 నుంచి 26 సంక్షేమ పథకాలు

మే 18 నుంచి 23 వరకు యువత.. క్రీడలు

జూన్‌ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణ

మే 4 నుంచి 10 వరకు

వ్యవసాయం.. రైతు సంక్షేమం

ఏప్రిల్‌ 6 నుంచి 11 ఆరోగ్యం

10 ప్రధాన అంశాలు ఇవే..

నేడు పరిసరాల పరిశుభత్ర..ఫైళ్ల క్లియరెన్స్‌తో శ్రీకారం

ప్రారంభించనున్న ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర

హాజరుకానున్న మంత్రులు

జూపల్లి, వాకిటి శ్రీహరి సైతం..

జూన్‌ 12 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు

జిల్లా, మండల స్థాయిలో పర్యవేక్షణకు నోడల్‌ అధికారుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement